జనం న్యూస్ జూన్ 21 ఆసిఫాబాద్ జిల్లా బ్యూరో
శివ కేశవ నగర్ కు చెందిన ఇటాన్ కార్ శంకర్ (27)కు నాలుగేళ్ల క్రితం అదే గ్రామానికి చెందిన లక్ష్మీతో వివాహం జరిగింది. కొద్దికాలంగా శంకర్ మద్యానికి బానిసై భార్యతో గొడవలు పడే వాడు. దీంతో ఆమె 2 నెలల క్రితం పుట్టింటికి వెళ్లింది. దీంతో ఈ నెల 18న శంకర్ మనస్తాపానికి గురై ఇంట్లో ఎవరూ లేని సమయంలో మద్యం మత్తులో పురుగుల మందు తాగాడు. కుటుంబ సభ్యులు వెంటనే స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం మంచిర్యాల ప్రవేట్ ఆసుపత్రికి తరలించారు.
అక్కడ చికిత్స పొందుతూ శుక్రవారం రాత్రి 9: 30లకు మృతి చెందినట్లు తెలిపారు.
ఈ మేరకు మృతుడి తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు వాంక డి ఎస్ఐ ప్రశాంత్ తేలిపారు.