జనం న్యూస్ :21 జూన్ శనివారం; సిద్దిపేట నియోజికవర్గ ఇన్చార్జి వై.రమేష్:
సిద్దిపేట ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవంను ముఖ్య అతిథి సిద్దిపేట కలెక్టర్ కె. హైమావతి ప్రారంభించినారు. వ్యాస మహర్షి యోగా సొసైటీ, సిద్దిపేట జిల్లా యోగాసనా స్పోర్ట్స్ అసోసియేషన్, భారత స్వాభిమాన్ ట్రస్ట్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ యోగా దినోత్సవానికి యోగ గురువు తోట అశోక్ కార్యక్రమ నిర్వహణ, వ్యాఖ్యాతగా వివరించారు. వ్యాస మహర్షి యోగ సొసైటీ యోగ గురువు తోట సతీష్ చేత కలెక్టర్ కె. హైమావతి, అడిషనల్ కలెక్టర్ గరిమ అగర్వాల్, మున్సిపల్ చైర్మన్ మంజుల రాజనర్సు, జిల్లా అధికారులు, అనధికారులు, వివిధ పాఠశాలల, కళాశాలల- ప్రిన్సిపల్స్, గెజిటెడ్ హెచ్ఎంలు, వ్యాయామ ఉపాధ్యాయులు, టీచర్స్, యోగా శిక్షణా గురువులు, విద్యార్థినీ, విద్యార్థులందరికీ దాదాపు ఒక గంట సేపు చక్కటి యోగాసనాలు వేయించినారు. కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వ నర్సింగ్ కళాశాల విద్యార్థులు అబ్బురపరిచే యోగ విన్యాసాలను ప్రదర్శించినందుకు, దాదాపు 170 మంది విద్యార్థినీలు యోగాసనాల్లో పాల్గొన్నందుకు కలెక్టర్ కె. హైమావతి, తదితరులు అభినందించినారు. ఈ కార్యక్రమంలో విద్యార్థినీలు పాల్గొనడానికి ప్రోత్సహించిన నర్సింగ్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ కె.టి. షిబా, వైస్ ప్రిన్సిపాల్ యం. విజయ కుమారి అసిస్టెంట్ ప్రొఫెసర్, క్లాస్ కోఆర్డినేటర్ చైతన్య, ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్ అనూష, లెక్చరర్స్ శైలజ, భవాని, ఉమావాణి, ఇదే కళాశాల సైకాలజీ ఫ్యాకల్టీ గెజిటెడ్ హెచ్ఎం(రి) గడ్డం బాలకిషన్ (తను పి.ఎస్.డబ్ల్యూ.ఏ అధ్యక్షులు యోగ శిక్షణ సంస్థ గురువు అయిత అంజయ్య గారి యోగ శిక్షణ బృంద సభ్యుడు), జిహెచ్ఎం మనోహర్ జిజిహెచ్ఎస్ స్టాఫ్, సెక్టోరియల్ ఆఫీసర్ రామస్వామి, సీనియర్ పాత్రికేయులు అంజయ్య, కౌన్సిలర్స్ చిప్ప ప్రభాకర్, కాటం శోభారాణి రఘురాం క్యాతం సాయి మొదలైన యోగ అభిమానులు అందరూ పాల్గొని కార్యక్రమం విజయవంతం చేశారు.