జనం న్యూస్ నందలూరు అన్నమయ్య జిల్లా.
నందలూరు లో యోగా ద్వారా పరిపూర్ణ ఆరోగ్యం లభిస్తుందని మండల ప్రత్యేక అధికారి గుణశేఖర్ పిళ్ళై తహసిల్దార్ అమరేశ్వరి ఎంపీడీవో రాధాకృష్ణ నాగిరెడ్డిపల్లి మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్ జంబు సూర్యనారాయణ లు అన్నారు. శనివారం ప్రపంచ యోగా దినోత్సవం లో భాగంగా నాగిరెడ్డిపల్లి గ్రామపంచాయతీ లోని జిల్లా పరిషత్ క్రీడా మైదానం అలాగే నాగిరెడ్డి పల్లె జిల్లా పరిషత్ హై స్కూల్ ప్రాంగణంలో నాగిరెడ్డిపల్లి గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున యోగా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతిరోజు యోగా ఆసనాల ద్వారా దీర్ఘకాలిక వ్యాధులు పోవడంతో పాటు ఆందోళన ఒత్తిడి మానసిక ప్రశాంతత ధ్యానం ద్వారా లభిస్తుందన్నారు. ప్రతి ఒక్కరూ ఉదయం పూట ఆసనాలు వేయడం నేర్చుకోవాలని తద్వారా మానవాళికి ఎంతో మేలు జరుగుతుందన్నారు. భారతదేశ ప్రధాని నరేంద్ర మోడీ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు పిలుపుమేరకు గత నెల రోజులుగా నిర్వహించిన యోగ కార్యక్రమాలు విజయవంతంగా జరిగాయని పేర్కొన్నారు. ఈ కార్య క్రమంలో యోగా నిర్వాహకులు రాజా అనిల్ శివ గ్రామ కార్యదర్శి సురేష్ యోగ ప్రత్యేక అధికారులు నిర్వాహకులు ఈఓర్ డి సురేష్ సచివాలయ సిబ్బంది చంద్రశేఖర్ రఫీ లక్ష్మి భార్గవి సిబ్బంది టు కార్యదర్శి వెంకటరమణ వెలుగు సిసి రామ్మోహన్ అంగనవాడి వర్కర్లు ఆశా వర్కర్లు ఏఎన్ఎంలు పెద్ద ఎత్తున ప్రజలు పాల్గొన్నారు.