జనం న్యూస్ జూన్ 21 ఆసిఫాబాద్ జిల్లా బ్యూరో
కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాబెజ్జుర్ మండలం పరిధిలోని మార్తిడి, లంబాడిగూడ గ్రామలలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఎమ్మెల్సీ దండే విట్టల్ ఆదేశాల మేరకు ఇందిరమ్మ కమిటీ ఆధ్వర్యంలోముగ్గులు, మార్టిడిలో 22మందిఇందిరమ్మ ఇండ్ల లబ్ది దారుల పత్రాలు లంబాడిగూలో 7గురి కి,, అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా పేదింటి సొంతింటి కలను నెరవేరుస్తున్నామని, కేవలం ప్రజా ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ద్వారానే సాధ్యం అవుతుందని మండలం అధ్యక్షులు శంకర్ యాదవ్ అన్నారు. నిరుపేదల సొంతంటి కల సాకారం ప్రజా ప్రభుత్వ యొక్క లక్ష్యం అని.ఇందులో ఎవరైనా దళారులు చేతివాటం ప్రయోగిస్తే కఠినచర్యలు ఉంటాయని అని హెచ్చరించారు. ఇండ్లు లేని ప్రతి నిరుపేదలకు ఇండ్లు మంజూరు చేస్తాం అని దళారులను నమ్మి ఎవరు మోసపోవద్దని ఆయన ఈ సందర్భంగా ప్రజలకు సూచించారు.ఈ కార్యక్రమంలోకార్యదర్శి గురూదాస్,, ఏ ఈ సాహిల్ మహ్మద్. డైరెక్టర్ ఆత్రం రాజన్న, మండలం అధ్యక్షులు బుస శంకర్ యాదవ్ ఇందిరమ్మ కమిటీ సభ్యులు.ఉమ్మేరా లింగయ్య, కమల, దుర్గయ్య, వాజీద్,బీమక్కా, కవిత దూపం.కాంగ్రెస్ కార్యకర్తలు, గ్రామస్తులు తదితరులు ఉన్నారు.