సబ్ టైటిల్ చినుకు జాడ కోసం రైతన్న ఎదురుచూపులునేలకు తడి లేక రైతుల దిగాలుఎండకు మాడిపోతున్న విత్తనాలుఈ సీజన్ పై రైతుల ఆశలు
జనం న్యూస్ జూన్ 23(మునగాల మండల ప్రతినిధి కందిబండ హరీష్)-సబ్జెక్టు -సీజన్ కు ముందే మోస్తరు వర్షాలతో మురిపించిన వరుణుడు తీరా ముఖం చాటేయడంతో రైతన్న ఆందోళనలో పడ్డాడు.వాన కోసం రైతులు ఎదురుచూస్తున్నారు.ఈ ఏడాది నైరుతి రుతుపవనాలు ప్రవేశించినప్పుడు అక్కడక్కడ భారీ వర్షాలు పడ్డాయి.దీంతో రైతులు జూన్ మొదటి వారంలోనే విత్తనాలు వేసేందుకు సిద్ధమయ్యారు. ఇప్పుడు వర్షాలు పడకపోవడంతో ఆందోళన చెందుతున్నారు.దుక్కులు సిద్ధం చేసుకుని వర్షాల కోసం రైతన్నలు ఎదురు చూస్తున్నారు.