జనం న్యూస్ 23 జూన్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక
విజయనగరానికి చెందిన సీనియర్ వీడియో జర్నలిస్ట్ రాజశేఖర్ అనారోగ్యంతో నిన్న రాత్రి మృతి చెందారు.
ఇటీవల బ్రెయిన్ స్ట్రోక్‌కు గురి కావడంతో కుటుంబ సభ్యులు, సహచరులు చికిత్స కోసం ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. మెరుగైన చికిత్స కోసం కేజీహెచ్‌లో జాయిన్ చేశారు. పరిస్థితి విషమించడంతో చనిపోయారు. రాజశేఖర్ మృతితో కుటుంబ సభ్యులు, తోటి జర్నలిస్ట్‌లు శోక సంద్రంలో మునిగిపోయారు.