జనం న్యూస్ 23 జూన్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక
కళాశాలల జిల్లా గ్రంథాలయ కమిటీ కన్వీనర్ గా బుద్ధరాజు రామభద్రరాజు ను నియమిస్తూ ఆదివారం జిల్లా గ్రంథాలయ సేవా సంఘం గౌరవ అధ్యక్షులు నాలుగెస్సులరాజు, వ్యవస్థాపకులు అబ్దుల్ రవూఫ్, ఉపాధ్యక్షులు కె. దయానంద్ లు సంఘ కార్యాలయంలో ఆయనకు నియామకపత్రం అందజేశారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ 34 ఏళ్ళ పాటు గ్రంథాలయ అధికారిగా, గ్రంథాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షులుగా పనిచేసిన రామభద్రరాజు జిల్లాలో గ్రంథాలయాల అభివృద్ధికి ఎనలేని కృషి చేసారని అన్నారు. వీరి ఆధ్వర్యంలో కళాశాలల్లో గ్రంథాలయాలను బలోపేతం చేస్తూ విద్యార్థుల్లో పుస్తకపఠనం పెంపొందిస్తూ, గ్రంథాలయాల కార్యక్రమాలను ప్రోత్సాహించడం జరుగుతుందని, అలాగే ముఖ్యమైన జాతీయ, అంతర్జాతీయ దినోత్సవాలను నిర్వహించడం జరుగుతుందని అన్నారు. ఈ సందర్బంగా రామభద్రరాజుకు గ్రంథాలయ సంఘం సభ్యులు పలువురు అభినందనలు తెలియజేసారు.