జనం న్యూస్ 24జూన్ పెగడపల్లి ప్రతినిధి .
జగిత్యాల జిల్లా పెగడపల్లి మండలం లో ఈ రోజున శ్యామ ప్రసాద్ ముఖర్జీ వర్ధంతి సందర్భంగా పెగడపల్లి మండలంలో అంబేద్కర్ చౌరస్తా వద్ద జన సంగు వ్యవస్థాపక అధ్యక్షులు శ్యామ ప్రసాద్ ముఖర్జీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించడం జరిగింది. నరేంద్రమోడీ 11సంవత్సరాల పాలనను ప్రజలకు వివరిస్తూ కరపత్రం ఇవ్వడం జరిగింది తర్వాత మండల కేంద్రంలో గల బీరప్ప గుడి ఆవరణంలో చెట్లు నాటారు. ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్ గంగుల కొమురెల్లి రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు చింతకింది అనసూర్య,ప్రధాన కార్యదర్శులు, కొత్తూరి బాబు, షేర్ అంజన్న, పెంట నరేందర్,కాకర్ల సతీష్,తడగొండ అంజన్న, కాసెట్టి రాజు, భోగ లతీష్,మిట్టపల్లి రాజేశ్వర్ రెడ్డి, మన్నే రమేష్, పోరెడ్డి మల్లేష్, నిఖిల్ గౌడ్, బీరయ్య చింతకింది రఘు, బైరా హరీష్, ఉప్పులేటి రమేష్, తిరుమల్ రెడ్డి, నందగిరి అనిల్, శంకరయ్య తదితరులు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.