జనం న్యూస్ జూన్ 23 ముమ్మిడివరం ప్రతినిధి
భారతీయ జనతా పార్టీ, డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా బెండామూర్లంక గ్రామంలో గ్రామ కమిటీ అధ్యక్షుడు లింగం చిన్ని అధ్యక్షతన జరిగిన శ్యామా ప్రసాద్ ముఖర్జీ బలిదాన దివాస్ కార్యక్రమానికి ముఖ్యఅతిదులుగా పురపు జిల్లా బిజెపి అధ్యక్షుడు యాళ్ల దొరబాబు అనకాపల్లి జిల్లా ఇన్చార్జి కర్రీ చిట్టిబాబు ముఖ్య అతిథులుగా హాజరై , శ్యామా ప్రసాద్ ముఖర్జీ చిత్రపటానికి పూలమాలవేసి బలిదాన దివాస్ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన యాళ్ల దొరబాబు మాట్లాడుతూ జూన్ 9 2025 నాటికి కేంద్ర ప్రభుత్వం ఏర్పడి 11 సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంగా కేంద్ర ప్రభుత్వం సాధించిన విజయాలను గూర్చి ప్రజలకు క్షుణంగా వివరించారు. అలాగే కేంద్ర ప్రభుత్వ పథకాల ప్రయోజనాలను అందించడం మరియు సేవా, సుపరిపాలన, పేదల సంక్షేమం మరియు వికసిత భారత్ ఆధారంగా ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని దొరబాబు అన్నారు బిజెపి అనకాపల్లి జిల్లా ఇన్చార్జి కర్రీ చిట్టిబాబు మాట్లాడుతూ వికసిత భారత్ అమృత కాలం అభ్యాన్ లోని ముఖ్యాంశాలు యూపీఏ మరియు ఎన్డీఏ ప్రభుత్వాల పనితీరుల తూలనాత్మక విశ్లేషణ మరియు వికసిత్ భారత్ 2047 అమృతకాలం దిశగా కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం యొక్క కృషిని ఈ కార్యక్రమాల ద్వారా ప్రచారం చేయడం జరుగుతుందని అలాగే బిజెపి ప్రభుత్వం యొక్క విధానాలు మరియు విజయాల పట్ల అవగాహన పెంచడం జరుగుతుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బూత్ సభ్యులు పాల్గొన్నారు