ప్రజా పాలన గ్రామసభలో ఇరు పార్టీల లీడర్ల నువ్వా నేనా
జనం న్యూస్,జనవరి 24,కంగ్టి:- సంగారెడ్డి జిల్లా కంగ్టి మండల పరిధిలోని తడ్కల్ గ్రామంలోని స్థానిక గ్రామ సచివాలయంలో ప్రజా పాలన గ్రామసభను శుక్రవారం నిర్వహించారు.ప్రజా పాలన గ్రామసభ పంచాయతీ ప్రత్యేక అధికారి విజయ భాస్కర్,అధ్యక్షతన నిర్వహించారు.ఈ సందర్భంగా మండల ప్రత్యేక అధికారి ఏడిఏ నూతన్ కుమార్, మాట్లాడుతూ అర్హులైన వారందరికీ సంక్షేమ పథకాలు అందించేందుకే గ్రామ సభలను నిర్వహిస్తున్నామని అన్నారు.తెలంగాణ ప్రజా ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ఇందిరమ్మ ఇండ్లు,రైతు భరోసా,రేషన్ కార్డుల పంపిణీ తదితర కార్యక్రమాలను ఈనెల 26వ తేదీ నుంచి అందించడానికే ఈ గ్రామసభలు నిర్వహిస్తుందని అన్నారు.అర్హులైన వారందరికీ సంక్షేమ పథకాలు అందించడమే ప్రభుత్వ లక్ష్యం అన్నారు.రాష్ట్ర ప్రభుత్వం ప్రతి గ్రామంలో ప్రజాపాలన గ్రామసభ నిర్వహించడం జరుగుతుందని అన్నారు.గ్రామ సభ ద్వారా గ్రామంలో అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇల్లు,రైతు భరోసా,ఇందిరమ్మ ఆత్మీయ భరోసా,రేషన్ కార్డులు పంపిణీ చేయడం జరుగుతుంది. ప్రభుత్వ సంక్షేమ పథకాల లబ్దిదారుల జాబితాలో పేరు లేకపోయిన నిరాశ పడవద్దని ఇది నిరంతర ప్రక్రియ దరఖాస్తు పెట్టుకుంటే సంబంధిత అధికారులు పరిశీలించి లబ్ధిదారులకు లబ్ది జరిగేలా చర్యలు చేపడతామని అన్నారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి శ్రీనివాస రావు,ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్ విష్ణు,పెద్ద మల్లారెడ్డి, కోటగిరి మనోహర్,తటి వీరేశం,కోట ఆంజనేయులు,పండరి నాథరావు,గుర్రపు సత్యనారాయణ, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.