బాధితులకు భరోసా కల్పించాలి..
ఆధునిక పోలీసింగ్ నిర్వర్తించాలి..
ప్రతి ఫిర్యాదు అంతర్జాలంలో నమోదు చేసి రశీదు ఇవ్వాలి..
సిబ్బంది ప్రవర్తనపై, పోలీసు సేవలపై ప్రజల నుండి ఫీడ్ బ్యాక్ వస్తుంది..
పోలీస్ స్టేషన్ రిసెప్షన్, సెక్షన్ విధులపై పోలీసు సిబ్బందికి శిక్షణ..
సూర్యాపేట జిల్లా ఎస్పీ కె.నరసింహ..
జనం న్యూస్ జూన్ 24(మునగాల మండల ప్రతినిధి కందిబండ హరీష్)
పోలీస్ పని విభాగాల నిర్వహణలో భాగంగా సోమవారం సూర్యాపేట జిల్లా పోలీసు కార్యాలయం నందు పోలీసు స్టేషన్ రిసెప్షన్ సెంటర్ ఫిర్యాదుల నిర్వహణ సిబ్బందికి పోలీస్ స్టేషన్ నిర్వహణ సెక్షన్ ఇంచార్జీ సిబ్బందికి జిల్లా ఎస్పీ నరసింహ ఆదేశాల మేరకు విధుల నిర్వహణపై శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. అదనపు ఎస్పీ రవిందర్ తో కలిసి ఎస్పీ కె.నరసింహ శిక్షణ కార్యక్రమానికి హాజరై సిబ్బందికి వీధుల నిర్వహణపై సూచనలు ఆదేశాలు ఇచ్చారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. సమాజంలో పోలీస్ యూనిఫాం కు ప్రత్యేకత ఉన్నది. పోలీస్ యూనిఫాం ధరించిన వారిని ప్రజలు గమనిస్తారు.సిబ్బంది క్రమశిక్షణతో ఉండి ప్రజలను పోలీసు స్టేషన్ కు వచ్చే బాధితులను,పిర్యాదుదారులను గౌరవిస్తూ గర్వంగా పని చేయాలని సూచించారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ పారదర్శకంగా పని చేస్తూ ఆధునిక పోలీసింగ్ నిర్వహిస్తేనే సమాజంలో పోలీసు శాఖపై నమ్మకం పెరుగుతుంది. ఆ దిశగా సిబ్బంది టీం వర్క్ చేయాలని అన్నారు. పోలీసు విధుల్లో అత్యంత ప్రధానమైనది పోలీస్ స్టేషన్ రిసెప్షన్ విధులు, ఫిర్యాదుల నిర్వహణ అన్నారు. పోలీస్ స్టేషన్ కు వచ్చే వారికి ఇబ్బంది కలగకుండా విధిధర్మంతో వారికి కావలసిన సహాయాన్ని అందించాలి వారితో మర్యాదగా ప్రవర్తించాలి అన్నారు. ప్రతి ఫిర్యాదును పిటిషన్ మేనేజ్మెంట్ సిస్టమ్ నందు నమోదు చేసి రశీదు ఇవ్వాలని ఆదేశించారు. పోలీసు విదులు, ప్రవర్తన, పోలీసు సేవలపై ప్రజల నుండి ఫీడ్ బ్యాక్ వస్తుంది అన్నారు. పిర్యాధులపై వేగంగా పని చేయాలి. ప్రాథమిక దర్యాప్తు త్వరగా చేసి బాదితులకు భరోసా కల్పించాలన్నారు. సెక్షన్ ఇంచార్జీ బాధ్యతగా వ్యవహరిస్తూ స్టేషన్ ను సమర్థవంతంగా నిర్వర్తించాలి.ఎలాంటి విభేదం చూపకుండా సిబ్బందికి విధులు కేటాయించాలి.పోలీసు సిబ్బందికి, స్టేషన్ అధికారికి సమన్వయం చేయాలి అన్నారు. సిబ్బంది విధులపై పర్యవేక్షణ చేయాలని సూచించారు. రిసెప్షన్ నందు మహిళా పోలీసు సిబ్బందిని నియమించి బలోపేతం చేశాం. ప్రజలు పోలీసు సేవలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు.ఈ కార్యక్రమం నందు అదనపు ఎస్పి రవిందర్ రెడ్డి,డిసి ఆర్బి ఇన్స్పెక్టర్ హరిబాబు,ఐటి కోర్ ఆర్ ఎస్ఐ రాజశేఖర్, రిషప్షన్ పని విభాగం కొ ఆర్డినేటర్ ఎస్ఐ మహిశ్వర్, టెక్నికల్ టీం సిబ్బంది, డిసిఆర్బి సిబ్బంది, మహిళా సిబ్బంది పాల్గొన్నారు.