జనం న్యూస్ 24 జనవరి 2025 విష్ణు వర్ధన్ గౌడ్ జిల్లా బ్యూరో ఇంచార్జీ జోగులాంబ గద్వాల్ జిల్లా బెంగళూరు : కొత్త ఏడాది ప్రారంభమై నెల రోజులు గడవక ముందే బెంగళూరులో తొలి మంకీ ఫాక్స్ పాజిటివ్ కేసు నమోదైంది. దుబాయ్ నుంచి వచ్చిన 40 ఏళ్ల వ్యక్తికి Mpox పాజిటివ్ నిర్ధారనైంది. ప్రస్తుతం అతడిని విక్టోరియా ఆసుపత్రిలో చేర్చి చికిత్స అందిస్తున్నారు. దుబాయ్ నుంచి బెంగళూరు విమానంలో వచ్చిన అతడి కాంటాక్ట్ లిస్ట్‌ను అధికారులు ట్రాక్ చేసే పనిలో పడ్డారు. ఈ వైరస్ వేగంగా వ్యాప్తి చెందకుండా అన్ని నివారణ చర్యలు తీసుకుంటున్నట్లు ఆ రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది.గతేడాది ఆఫ్రికాలోని సుమారు 15 దేశాలు ఈ ప్రాణాంతక ఇన్ఫెక్షన్తో పోరాడాయి. దీంతో 2024 ఆగస్టు మధ్యలో ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రపంచ అత్యవసర పరిస్థితిని ప్రకటించింది. కాగా మంకీ వైరస్ మొదటిసారి సెప్టెంబర్ 2023లో కాంగోలో బయటపడింది. స్వీడన్, థాయ్‌లాండ్‌తో సహా పలు దేశాల్లో ఈ వైరస్ కేసులు వేగంగా వ్యాప్తి చెందాయి.
ఇటీవల, బ్రిటన్ ఆరోగ్య భద్రతా ఏజెన్సీ (UKHSA) కూడా ఇంగ్లాండ్‌లో మరో mpox వేరియంట్ క్లాడ్ Ib కేసు నమోదైనట్లు నివేదించింది. గత ఏడాది అక్టోబర్ నుంచి ఈ దేశంలో ఇది ఆరో కేసు. క్లాడ్ 1b అనేది ప్రాణాంతకమైన Mpox జాతికి చెందిన వేరియంట్.