జనం న్యూస్ 24 జూన్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక
తాటిపూడి రిజర్వాయర్ క్రింద ఉన్న రైతులకు సాగునీరు అందించాలని ఆయకట్టు పరిరక్షణ కమిటీ నాయకుడు బి.రాంబాబు డిమాండ్ చేశారు. సోమవారం విజయనగరం కలెక్టరేట్ వద్ద జరిగిన ధర్నాలో ఆయన మాట్లాడుతూ… జిల్లాకు చెందిన రిజర్వాయర్ నీటిని రైతులకు అందించకుండా ప్రభుత్వం విశాఖ జేవీఎంసీకి తరలించి కోట్లలో వ్యాపారం చేస్తుందన్నారు. తాగునీటి కోసమని తీసుకు వెళ్లి పరిశ్రమలకు నీటిని అమ్ముకోవడం దుర్మార్గమన్నారు.