మాజీ జెడ్పీటీసీ జర్పుల రాజ్ కుమార్ నాయక్.
(జనం న్యూస్ 24 జూన్ భీమారం మండల ప్రతినిధి కాసిపేట రవి)
మంగళవారం రోజు న హైద్రాబాద్ లో రాష్ట్ర అధ్యక్షుడు అజ్మీరా పుల్ సింగ్ నాయక్, రాష్ట్ర మహిళా అధ్యకురాలు సుశీల బాయి, రాష్ట్ర జనరల్ సెక్రటరీ బానోత్ శ్రీనివాస్ నాయక్ చేతుల మీదుగా మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు గా రాజ్ కుమార్ నాయక్ ని నియమించడం జరిగింది.. ఈ కార్యక్రమం లో సంఘం రాష్ట్ర నాయకులు మరియు జిల్లా అధ్యక్షులు కుల పెద్దలు తదితరులు పాల్గొన్నారు.ఈ సందర్బంగా రాజకుమార్ నాయక్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర కార్మిక, మరియు మైనింగ్ శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి ని, రెవిన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డిని, ఎస్ సి సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ ని కలిసి కుల సంఘం వినతులను ఇవ్వడం జరిగింది.