(జనం న్యూస్ 24 భీమారం మండల ప్రతినిధి కాజీసిట రవి)
భీమారం మండల గ్రామపంచాయతీలో మంగళవారం రోజున కేంద్ర జల శక్తి అభియాన్ కేంద్ర మంత్రిత్వ శాఖ చేపట్టిన 58 రకాల పనులపై జల శక్తి అభియాన్ కేంద్ర బృందం శాస్త్రవేత్త రాంబాబు ఆరా తీశారు. భీమారం నర్సింగాపూర్,దాంపూర్, ధర్మారం,పొలంపల్లి, కొత్తపల్లి మద్దికల్, గ్రామాలలో . పెర్క్యూలేషన్ ట్యాంక్ సోఐకేపీట్స్ ట్రెంచెస్ రూఫ్ వాటర్ హార్వస్టింగ్ స్ట్రక్చర్ పనులు పరిశీలించి సంతృప్తి చెందారు. ఈ కార్యక్రమం లో భీమారం ఎంపీడీవో మధుసూదన్, ఏపీఓ, ఇ సీ, డిఆర్పి రాజ్ కుమార్, సదానందం, ప్లాంటేషన్ మేనేజర్ సత్యనారాయణ, టెక్నికల్ అసిస్టెంట్ ఫీల్డ్ అసిస్టెంట్లు తదితరులు పాల్గొనడం జరిగింది.