జనం న్యూస్ జూన్ 24, జగిత్యాల జిల్లా, మెట్ పల్లి: తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ సెల్ లీగల్, హ్యూమన్ రైట్స్, సమాచార హక్కు విభాగం కమిటి రాష్ట్ర జాయింట్ కన్వీనర్ గా సీనియర్ కాంగ్రెస్ నాయకులు,మాజీ మండల పరిషత్ అధ్యక్షులు, సీనియర్ న్యాయవాది కోటగిరి వెంకటస్వామిని నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నియామక పత్రాన్ని కమిటీ చైర్మన్ పొన్నం అశోక్ గౌడ్ చేతుల మీదుగా అందుకోవడం జరిగిందని అన్నారు. ఈ నియమకానికి సహకరించిన కోరుట్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ జువ్వాడి నర్సింగరావు,మాజీ మంత్రువర్యులు తాటిపర్తి జీవన్ రెడ్డి,రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు జువ్వాడి కృష్ణారావు, కొమిరెడ్డి కరం, నిజామాబాద్ పార్లమెంట్ లీగల్ సెల్ కో ఆర్డినేటర్ గుంటి జగదీశ్వర్, జగిత్యాల జిల్లా లీగల్ సెల్ ఇంచార్జ్ సలీమ్ లకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నట్లు కోటగిరి వెంకటస్వామి తెలిపారు.