జనం న్యూస్ జూన్ 25(మునగాల మండల ప్రతినిధి కందిబండ హరీష్)
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా రైతులకు పెట్టుబడి సహాయం భాగం రైతులకు ఎకరానికి 6000/ చొప్పున రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ అయినా సందర్భంగా మండల కిసాన్ సెల్ ఆధ్వర్యంలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, రాష్ట్ర ఇరిగేషన్ పౌరసరఫరాల శాఖ మంత్రి కెప్టెన్ యన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి,కోదాడ ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి ఫ్లెక్సీ లకు పాలాభిషేకం చేసి స్వీట్ పంపిణీ చేశారు.అనంతరం గణపవరం క్రాస్ రోడ్లో టపాసులు కాల్చి రైతు భరోసా సంబరాలు చేశారు.ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కొప్పుల జైపాల్ రెడ్డి, కిసాన్ సెల్ జిల్లా అధ్యక్షుడు బచ్చు అశోక్, కోదాడ నియోజకవర్గ అధ్యక్షులు మాతంగి బసవయ్య, మండల అధ్యక్షుడు నర్రా శీపాల్ రెడ్డి, కోదాడ మార్కెట్ డైరెక్టర్ కాసర్ల కోటేశ్వరరావు, కాంగ్రెస్ పార్టీ నాయకులు సీనియర్ నాయకులు నల్లపాటి శ్రీనివాస్,ఉప్పుల జానకి రెడ్డి,కాసర్ల శ్రీనివాస్, కొమ్ము ఈదారావు శెట్టి గిరి,గోపి,కాసర్ల వెంకట్, నాగేశ్వరరావు, సోమపంగు గోపి,మళోత్ మహేష్, పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులు, రైతులు , తదితరులు పాల్గొన్నారు.