జనం న్యూస్ జూన్ 24 నడిగూడెం
నడిగూడెం మండలంలోని సిరిపురం రైతు వేదిక క్లస్టర్ నందు మంగళవారం రైతు భరోసా సంబరాలు ఘనంగా నిర్వహించారు. రైతులకు ఎలాంటి పరిమితులు, షరతులు విధించకుండా వ్యవసాయ భూముల జాబితాలో ఉన్న మొత్తం విస్తీర్ణానికి పెట్టుబడి సాయం అందించినందుకుగాను సీఎం రేవంత్ కి రైతులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో ఏవో దేవప్రసాద్, ఏఈఓ రేణుక, రైతులు పాల్గొన్నారు