జనం న్యూస్, జూన్ 25 ( తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ ములుగు విజయ్ కుమార్)
సిద్దిపేట జిల్లా మార్కుక్ మండల కేంద్రం లోని రైతు వేదికలో మంగళవారం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రైతు భరోసా సంబరాలు నిర్వహించారు సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు ఈ సందర్భంగా మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కనకయ్య గౌడ్, సిద్దిపేట జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు మల్లేశం గౌడ్ మాట్లాడుతూ, రైతు ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రైతు భరోసా నిధులు పంపిణీ చేసిన సందర్భంగా రైతు భరోసా ఉత్సవాలు నిర్వహించడం సంతోషంగా ఉందని కాంగ్రెస్ పార్టీ ద్వారానే ప్రజా సంక్షేమ పాలన సాధ్యమని, ప్రతిపక్ష పార్టీలు మాటలకే పరిమితమయ్యారని, సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో తెలంగాణ రాష్ట్రం గణనీయమైన అభివృద్ధి సాధిస్తుందని రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ జయకేతనం ఎగురవేస్తుందని అన్నారు ఈ కార్యక్రమంలో వంటిమామిడి మార్కెట్ కమిటీ డైరెక్టర్ ర్యాకం యాదగిరి, నాయకులు నర్సింలు, తిరుపతి రెడ్డి,,కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు