జనం న్యూస్, జూన్ 25 ( తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ ములుగు విజయ్ కుమార్ )
జగదేవపూర్ మండలం లోని కొండపూర్ గ్రామానికి చెందిన తిగుళ్ళ రాజు ఐదు రోజుల క్రితం అప్పుల బాధ తో ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే కగా మంగళవారం రిపోర్టర్ రామచంద్రం బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు అనంతరం వారి కుటుంబానికి 50 కిలోల సన్న బియ్యం అందజేశారు,అదే విధంగా గ్రామ మాజీ సర్పంచ్ జహంగీర్ మృతిని కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చారు అనంతరం వారి కుటుంబానికి 50 కేజీ ల సన్న బియ్యం అందజేశారు.
అదే గ్రామానికి చెందిన పలువురు బాధిత కుటుంబానికి ₹ 1500/- రూ.అర్థిక సహాయం అందజేశారు,
ఈ సందర్భంగా రిపోర్టర్ రామచంద్రం మాట్లాడుతూ రాజు మృతి చాలా బాధాకరం అని చెప్పారు,వారి కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకుంటామని అన్నారు.ఆ కుటుంబానికి ఎప్పుడు ఏ వసరం వచ్చినా ఆ అండగా ఉంటానని చెప్పారు.ఈ కార్యక్రమంలో ఈ కార్యక్రమంలో గ్రామస్తులు జహంగీర్,కృష్ణ,అంజి,లక్ష్మణ్,చంద్రమౌళి,శ్రీలత,సాయిలు,మల్లేశం,నవీన్, తదితరులు పాల్గొన్నారు.