జనం న్యూస్, జూన్ 25 ( తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ ములుగు విజయ్ కుమార్ )
సిద్దిపేట జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఎస్సీ ఎస్టీ లకు సంబంధించిన సమస్యల పరిష్కారానికై నిర్వహించిన సదస్సులో తెలంగాణ ఎస్సీ ,ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకయ్య,కి వినతిపత్రం ఇవ్వటం జరిగింది.
ఈ సందర్భంగా( బీ డీ ఎస్ ఎఫ్) తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షులు దబ్బెట ఆనంద్, మాట్లాడుతూ సిద్దిపేట జిల్లా కేంద్రంలో ఎస్సీ ఎస్టీ హాస్టల్లో అద్దె భవనాల్లో కొనసాగుతా ఉన్నాయని. దూల్మిట్ట,కొండపాక, చేర్యాల ,మద్దూర్ ,సిద్దిపేట గర్ల్స్, హాస్టల్ వంటి అనేక హాస్టల్లో అద్దె భావనాల్లోనే కొనసాగుతా ఉన్నాయని వెంటనే సొంతభవనాలు మంజూరు చేయాలని అదేవిధంగా పెండింగ్లో ఉన్నటువంటి మేస్ , కాస్మోటిక్ చార్జీలు మార్చి , ఏప్రిల్ పెండింగ్ లో ఉన్నాయని అదేవిధంగా జిల్లావ్యాప్తంగా అన్ని హాస్టల్లో వెంటనే వైట్ వాస్ ,ఫ్యాన్సు ,ట్యూబ్ లైట్స్, బాత్రూం ప్రిపేర్ ,కరెంటు మరుగుదొడ్లు ,చాలా రిపేర్లు ఉన్నాయని అదేవిధంగా కొన్ని హాస్టల్లో వర్కర్స్ కొరత ఉందని కొత్త హాస్టల్స్ ఓపెన్ అయినవి జగదేవ్పూర్,మద్దూర్, దూల్మిట్ట ,కొత్త వార్డెన్స్ తో ఓపెన్ అయినాయి కానీ హాస్టల్లో అనేక సమస్యలు నెలకొన్నవి అని అన్నారు ఇవన్నీ సమస్యలు ఉండగా ఎస్సీ, ఎస్టీ మధ్యతరగతి విద్యార్థులు ఏ విధంగా చదువుకుంటారని ప్రశ్నించారు కాబట్టి వెంటనే ఈ సమస్యలకు పరిష్కారం చూపాలని లేనిపక్షంలో (బి డి ఎస్ ఎఫ్) ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రాజు, రమేష్ ,స్వామి తదితరులు పాల్గొన్నారు.