తెలుగు రాష్ట్రాల్లో పంపిణి శ్రీకారం చుట్టిన రామకోటి సంస్థ
భగవంతుని సేవే మహాభాగ్యం: రామకోటి రామరాజు
జనం న్యూస్, జూన్ 25 ( తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ ములుగు విజయ్ కుమార్ )
భద్రాచల రామయ్య తలంబ్రాల ఉచిత పంపిణి కార్యక్రమం సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలోని శ్రీరామకోటి భక్త సమాజం సంస్థ అధ్యక్షులు రామకోటి రామరాజు ఆధ్వర్యంలో తెలంగాణ వ్యాప్తంగా తలంబ్రాల పంపిణి జరుగుతుంది. మంగళవారం నాడు ఆంధ్రప్రదేశ్ లోని పాలకొల్లు, భీమవరం, రాజమండ్రి, నర్సాపురం ప్రాంతాలలో తలంబ్రాల పంపిణి రామకోటి సంస్థ సభ్యులు సురేష్ శెట్టి ఆధ్వర్యంలో అక్కడ భక్తులకు పంపిణి చేశారు. తలంబ్రాలు మాకు అందడం మా అదృష్టం అని ఆంధ్ర భక్తులు కొనియాడారు.