జనం న్యూస్- జూన్ 25- నాగార్జునసాగర్ టౌన్ రిపోర్టర్ విజయ్-
నాగార్జునసాగర్ హిల్ కాలనీలోని జిల్లా బాలభవన్ వారు పైలాన్ కాలనీ ప్రభుత్వ ఆదర్శ ఉన్నత పాఠశాలకు రెండు కుట్టుమిషన్లు అందజేశారు. జిల్లా బాల భవన్ సూపరిండెంట్ బాలు మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థినిల స్వయం ఉపాధి కొరకు టైలరింగ్ నేర్చుకోవడం ఎంతో ఉపయోగపడుతుందని, ప్రభుత్వ పాఠశాలల్లో జిల్లా బాల భవన్ వారి సహకారంతో చిత్రలేఖనం, డాన్స్ లు ఉచితంగా తర్ఫీదునిస్తామని తెలిపారు. ఆదర్శ ఉన్నత పాఠశాల జిహెచ్ఎం మాట్లాడుతూ పాఠశాల విద్యార్థినుల స్వయం ఉపాధి కొరకు టైలరింగ్ లో శిక్షణ ఇస్తారని, కుట్లు, అల్లికలలో తర్ఫీదునీయటానికి జిల్లా బాలభవన్ నాగార్జునసాగర్ నుంచి ఒక టీచర్ ను కేటాయించారని తెలిపారు. ఈ విద్య సంవత్సరం నుంచి తమ పాఠశాలలోనీ విద్యార్థులకు కరాటే, డ్రాయింగ్, డాన్స్ లలో ఉచితంగా శిక్షణ ఇవ్వనున్నామని, కంప్యూటర్ కూడా ఉచితంగా నేర్పించనున్నామని తెలిపారు. ఈ సదవకాశాన్ని విద్యార్థులు సద్వినియోగపరుచుకోవాలని తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో నే చేర్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో పాఠశాల జిహెచ్ఎం శేషు, రాజబాబు, లాలు, అంజయ్య, శ్రీనివాసరెడ్డి, భాగ్య, ఆజాం రాణి, నగేష్ మరియు జిల్లా బాలభవన్ నాగార్జునసాగర్ సూపరిండెంట్ బాలు, డ్రాయింగ్ మాస్టర్ మధుసూదన్, జహంగీర్ లు పాల్గొన్నారు.