బి అర్ ఎస్ పార్టీ నాయకులు దాచారం కనకయ్య
జనం న్యూస్, జూన్ 26 ( తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ ములుగు విజయ్ కుమార్ )
జగదేవపూర్ స్థానిక సంస్థల ఎన్నికల ముందు రైతు భరోసా పేరిట ఆడుతున్న డ్రామాలు ఆపి, 19 నెలల కాలంలో రైతన్నను అరిగోస పెట్టుకున్నందుకు కాంగ్రెస్ ప్రభుత్వం క్షమాపణలు చెప్పాలని టిఆర్ఎస్ పార్టీ మండల సీనియర్ నాయకులు కొండపోచమ్మ మాజీ డైరెక్టర్ దచారం కనకయ్య డిమాండ్ చేశారు.
బుధవారం మండల కేంద్రము లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు కాంగ్రెస్ రైతు పండగ సంబరాలు ఎందుకోసం రైతు భరోసా నాలుగు విడతలు ఎగ్గొట్టినందుకా? అని ప్రశ్నించారు. కేసీఆర్ కంటే ఎక్కువ ఇస్తాం.. ఎకరాకు రూ.15 వేలు ఇస్తామని చెప్పి రూ.12 వేలకు కుదించి.. అది కూడా ఇవ్వనందుకా? అని నిలదీశారు రూ..2 లక్షలు రుణమాఫీ అని చెప్పి అరకొర చేసి ఎగ్గొట్టినందుకా? ఏ కారణం చేత రైతు మరణించినా ఆ కుటుంబానికి ధీమాగా ఉండాలని రూ.5 లక్షల సాయం అందించే రైతుబీమా రాకుండా చేసినందుకా? ఏడాదిన్నర కాంగ్రెస్ పాలనలో దాదాపు 550 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నందుకా? వానాకాలం పంటకు క్వింటాలుకు రూ.500 బోనస్ బకాయిలు ఎగ్గొట్టినందుకా? యాసంగి పంటకు క్వింటాలుకు రూ.500 అసలు బోనస్ ఇవ్వనందుకా? కల్లాలకు వచ్చిన ధాన్యం నెలల తరబడి కొనకుండా కండ్ల ముందు అకాల వర్షాల పాలయ్యేలా చేసి కన్నీళ్లు పెట్టించినందుకా? కల్లాల్లో ధాన్యం ఉండగానే వాటిని కొనకుండా కొనుగోలు కేంద్రాలు ఎత్తేసినందుకా ఏడాదిన్నర పాలనలో ఒక్క చెరువు నింపకుండా, ఒక్క చెక్ డ్యాం కట్టకుండా, కొత్తగా ఒక్క ఎకరాకు నీళ్లు ఇవ్వనందుకా పదేళ్ల కేసీఆర్ పాలనలో ఆత్మవిశ్వాసం నింపుకుని ఆత్మస్థైర్యంతో ఉన్న రైతులను కేవలం 18 నెలల పాలనతో నిండా ముంచి, వ్యవసాయం నడ్డి విరిచినందుకా? అని ప్రశ్నించారు. లగచర్ల రైతులను జైలుకు పంపినందుకా? పెద్ద ధన్వాడ రైతులకు బేడీలు వేసినందుకా? ఐదు దశాబ్దాల కాంగ్రెస్ పాలనలో కేసీఆర్ లాగా ఒక్క పథకం అయినా ప్రవేశపెట్టారా? కోటి 50 లక్షల ఎకరాలకు నాలుగు విడతల్లో ఎకరాకు రూ.30 వేల చొప్పున ఈ ప్రభుత్వం రైతులకు ఎగ్గొట్టింది. నాలుగు విడతలుగా ఎగ్గొట్టిన రైతు భరోసా స్థానిక ఎన్నికల్లో ప్రజలు బుద్ధి చెబుతారు అన్న భయంతో అయినా రైతు భరోసా వేస్తున్నారని.. సచ్చినోని పెళ్లికి వచ్చిందే కట్నం అని రైతులు సరిపెట్టుకుంటున్నారు తప్ప సంబరాలు చేసుకోవడం లేదు. నాలుగు సార్లు రైతు భరోసా ఎగ్గొట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం రైతు పండగ పేరుతో సంబరాలు చేయాలి అనడాన్ని తీవ్రంగా ఖండించారు.
కేసీఆర్ నాట్లకు నాట్లకు మధ్య రైతు బంధు ఇస్తే, మీరు ఓట్లకు ఓట్లకు మధ్య రైతు భరోసా ఇచ్చి మభ్య పెట్టాలని చూస్తున్నారు. స్థానిక ఎన్నికల నేపథ్యంలో చేస్తున్న నీ జిమ్మిక్కుల ను రైతులు నమ్మరు. ఇచ్చిన హామీలు ఇప్పటికైనా అమలు చేయండి' అని సూచించారు.ఈ కార్యక్రమంలో ధర్మారం గ్రామ మాజీ సర్పంచ్ రాజు,బి అర్ ఎస్ పార్టీ మండల ఉప అధ్యక్షులు శ్రీను,మండల యూత్ విభాగం అద్యక్షులు బాలకృష్ణ,వార్డు సభ్యులు గణేష్,సోషల్ మీడియా అధ్యక్షులు భాస్కర్,యువ నాయకులు శ్రీకాంత్ తదితరులు అన్నారు.