జనం న్యూస్, జూన్ 26 ( తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ ములుగు విజయ్ కుమార్)
జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మర్కుక్ లో యాంటీ డ్రగ్స్ వారోత్సవాల లో బాగంగా డ్రగ్స్ రహిత సమాజం విద్యార్థుల పాత్ర పై వ్యాస రచన పోటీలు మండల స్థాయిలో ఏర్పాటు చేయబడినది. దీనిలో మండల విద్యాధికారి మార్కుక్ ప్రతి ఒక్కరూ డ్రగ్స్ రహిత సమాజం కోసం గట్టి కృషి చేయాలని కోరారు.ఇట్టి కార్యక్రమం లో ముఖ్య అతిథిగా మార్కుక్ మండల సబ్ ఇనస్పెక్టర్ ఆఫ్ పోలీసు దామోదర్ , ప్రధానోపాధ్యాయులు వెంకటేశం, లతి సైదా, బాలకృష్ణ , పి ర్ టి యు మండల శాఖ అధ్యక్షులు శ్రీనివాసరావు, ఉపాధ్యాయులు, రామకృష్ణ రెడ్డి, వెంకటయ్య, గణేష్, రమణ,వ్యాస రచన పోటీలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల దామరకుంట విద్యార్థి సిందుజ ప్రథమ స్థానం లో రాగా ద్వితీయ స్థానంలో దీపక్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మర్కుక్ విద్యార్థి,జూనియర్ విభాగంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మర్కుక్ సమ్మిత ప్రథమ స్థానంలో రాగా, చందన ప్రాథమికోన్నత పాఠశాలనుండి గెలుపొందారు. వారికి ముఖ్య అతిథిల చేతుల మీదుగా బహుమతి ప్రదానం చేయడం జరిగింది.