జనం న్యూస్, జూన్ 25, జగిత్యాల జిల్లా
, ఇబ్రహీంపట్నం మండలం, గోధుర్: టీపీసీసీ లీగల్ సెల్, హ్యూమన్ రైట్స్ మరియు సమాచార హక్కు విభాగం కమిటి రాష్ట్ర జాయింట్ కన్వీనర్ గా సీనియర్ కాంగ్రెస్ నాయకులు, మాజీ మండల పరిషత్ అధ్యక్షులు, సీనియర్ న్యాయవాది కోటగిరి వెంకటస్వామి నియమితులైన శుభసందర్భంలో వారి స్వగ్రామమైన ఇబ్రహిమపట్నం మండలంలోని గోధూరు గ్రామంలో గ్రామ ప్రముఖులు, మిత్రులు ఘనంగా సన్మానించారు. ఈ సందర్బంగా గ్రామ ప్రముఖులు మాట్లాడుతూ కోటగిరి వెంకటస్వామి మొదటినుండి అభ్యుదయ భావాలు కలిగి, ఎల్లప్పుడూ గ్రామ సంక్షేమం కోసం, ప్రజల సంక్షేమం కోసం నిరంతరం పరితపించే నిస్వార్థ నాయకుడిగా, సేవకుడిగా, విద్యావేత్తగా గుర్తింపు పొంది పార్టీని నమ్ముకుని పార్టీకోసం అహర్నిశలు చేసిన కృషిని గుర్తించి పార్టీలో మంచి పదవిని పొందడం మాకు మా గ్రామ ప్రజలకు గర్వకారణమని గ్రామ ప్రముఖులు, ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. మున్ముందు భవిష్యత్ లో మరిన్ని ఉన్నత పదవులు అధిష్టించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో గ్రామ అభివృద్ధి కమిటీ చైర్మన్ ఎడపల్లి వెంకటస్వామి, గ్రామ మాజీ సర్పంచ్ లు గోధూరు మురళి, చెట్ల చంద్రశేఖర్ గౌడ్, సోమ ప్రభాకర్, మాజీ ఉప సర్పంచ్ తాటికొండ రవితేజ, వీడీసీ మాజీ చైర్మన్ భూరం సంజీవ్, భూరం నారాయణ, రాడారపు రాజు, మాదం రాజన్న, గురుడు రాజగంగారాం, దురిశెట్టి నర్సింహా రాజు, ఒళ్లాడపు సుందరయ్య, శంకర్, చల్ల శంకర్, మ్యాన సత్యం, రాజారెడ్డి, చీమల శ్రీనివాస్, కోటగిరి క్రాంతి కుమార్, కోటగిరి చైతన్య, కోటగిరి సిద్దార్థ, చీమల రాజు, శ్రీకర్, రాజేష్, ప్రవీణ్, అనిల్, మహేష్ తదితరులు పాల్గొన్నారు.