-కొమ్ము ఉమేష్ యాదవ్
జనం న్యూస్, జూన్ 26 ( తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ ములుగు విజయ్ కుమార్)
ఆగని దోపిడీలు ఫీజుల పేర్లతో బుక్స్ డ్రెస్సులు అని అనేక ఇబ్బందులకు తల్లిదండ్రులను గురి చేస్తున్నారు ఇలాగే ఎవరిస్తే కచ్చితంగా బీసీ సంఘం ఆధ్వర్యంలో ప్రతి ఒక్క పాఠశాలకు తాళాలు వేస్తాం.సిద్దిపేట జిల్లా పుస్తకాలు బహిరంగంగా అమ్ముతూ సొమ్ము చేసుకుంటున్న కొమ్ము ఉమేష్ యాదవ్ సిద్దిపేట జిల్లా బీసీ సంఘం అధ్యక్షుడు విద్యాసంస్థలు విద్యార్థుల రక్తం తాగుతున్నారు బుక్ ఫీజ్ అని బడి ఫీజు అని బస్సు ఫీజు అని ట్యూషన్ ఫీజ్ అని డొనేషన్ ఫీజ్ అని ప్రైవేట్ విద్యాసంస్థలు దోచుకుంటున్నారు స్కూల్లో ఎలాంటివి అమ్మొద్దని గైడ్లైన్స్ ఉన్న అవి పెడచెవిన పెట్టి సొమ్ము చేసుకుంటున్నారు 2005 ఫీజు నియంత్రం చట్ట అమలులో ఉన్న అవన్నీ పట్టించుకోకుండా విద్యార్థుల రక్తం తాగుతున్నారు అలాంటి ప్రైవేట్ విద్యాసంస్థలను గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని విద్యాశాఖ మంత్రి నియమించి ప్రభుత్వ స్కూల్లో మెరుగైన వసతులు కల్పించాలని ప్రభుత్వం వెంటనే ఫీజు నియంత్రణ చట్టం అమలు తీసుకొచ్చి పేద విద్యార్థులకు న్యాయం చేయాలని కోరారు.ఈ సమావేశంలో బిసి సంఘం నాయకులు కృష్ణపురం లక్ష్మణ్ బాబు ముదిరాజ్ లక్ష్మణ్ శీను ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు