జనం న్యూస్ జూన్ 26(మునగాల మండల ప్రతినిధి కందిబండ హరీష్)-
మాదకద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం అవగాహన కార్యక్రమాలలో భాగంగా బుధవారం మునగాల పోలీసులు మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ పాఠశాల నందు విద్యార్థులకు డ్రగ్స్ నివారణపై పెయింటింగ్, డ్రాయింగ్ కార్యక్రమం నిర్వహించడం జరిగినది.ఈ సందర్భంగా ఎస్సై ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ.. డ్రగ్ రహిత సమాజం మన అందరి బాధ్యత అని, డ్రగ్ రహిత సమాజాన్ని నిర్మించడంలో నేటి విద్యార్థులు ప్రధాన భూమిక పోషించాలని అన్నారు.మాదకద్రవ్యాల దుర్వినియోగం మరియు అక్రమ రవాణా కు వ్యతిరేకంగా జరుగుతున్న పోరాటంలో ప్రతి ఒక్కరూ భాగ్యస్వామ్యం కావాలన్నారు. రాబోయే రోజుల్లో సమాజంలో మాదకద్రవ్యాల నిర్మూలనలో విద్యార్థుల పాత్ర చాలా కీలకమైనదని,విద్యార్థి దశ నుండి మంచి చెడుల పై అవగాహన కలిగి ఉండాలన్నారు.