జనంన్యూస్. 25. సిరికొండ. ప్రతినిధి.
సిరికొండ ఎస్సై ఎల్ రామ్ ఆధ్వర్యంలో చిన్న వాల్గోట్ మోడల్ స్కూల్ అండ్ కాలేజీ లో మత్తు పదార్థములు మరియు గంజాయి లాంటి మాదకద్రవ్యాలు వాడటo వల్ల కలిగే ఇబ్బందులు మరియు వాటికి యువత బానిస అయితే వారి యొక్క కెరీర్ ఎలా నాశనం అవుతుందో తెలియజేశారు .ఎవరైనా గంజాయి తీసుకొని పోలీసులకు పట్టుబడిన ,ఎలాంటి క్రిమినల్ కేసులలో ఇన్వాల్వ్ అయిన వారికి పాస్పోర్ట్ మరియు డ్రైవింగ్ లైసెన్స్ ఇవ్వరని తెలియజేశారు. కాబట్టి యువత చేజేతులా వారి యొక్క బంగారు భవిష్యత్తు నాశనం చేసుకోవద్దని హెచ్చరించారు.Si గారి సమక్షంలో మత్తు పదార్థములు వాడితే జైలు శిక్ష తప్పదని నినాదాలు చేస్తూ ఊరంత ర్యాలీ నిర్వహించారు.ఇట్టి కార్యక్రమం లో దాదాపుగా 200 మంది విద్యార్థులు ప్పాల్గొన్నారు.