జనం న్యూస్ జూన్ 25 ముమ్మిడివరం ప్రతినిధి
అమలాపురం పట్టణం లో స్థానిక ప్రెస్ క్లబ్ లో బీజేపీ జిల్లా అధ్యక్షులు అడబాల సత్యనారాయణ ఆధ్వర్యంలో బుధవారం ఎమర్జెన్సీ డే చీకటి అధ్యాయం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిలుగా మాజీ ఎమ్మెల్యే అయ్యాజీ వేమా పాల్గొని మాట్లాడుతూ 50 సంవత్సరాలు క్రితం 1975 జూన్ 25 న అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం ఎమర్జెన్సీ డే విధించి చీకటి అధ్యాయానికి తెర దీశారని అన్నారు. అప్పుడు సుమారు లక్ష మందిని అరెస్టు చేసి అనేక రకాల ఇబ్బందులకు గురి చేశారన్నారు. పౌర హక్కులను సర్వ నాశనం చేశారన్నారు. 21 నెలల కాలంలో ప్రజలు దౌర్భాగ్య పరిస్థితి అనుభవించారన్నారు. ఆరోజు భారత స్వాతంత్ర్య సమరవీరుల కలలన్నీ కల్లలైపోయాయి. అనేకమంది త్యాగాల ఫలితంగా సాధించకుండా స్వేచ్ఛ స్వాతంత్రంపై నీలి నీడలు కమ్ముకున్నాయి. ఎమర్జెన్సీకి గల కారణాలు తెలియజేశారు. 1971లో జరిగిన సార్వత్రిక ఎన్నికలలో ఇందిరాగాంధీ ఉత్తరప్రదేశ్లోని రాయబలేరి నియోజకవర్గ నుంచి పార్లమెంట్ కి ఎన్నికయింది. అయితే ఆ ఎన్నికలలో ఇందిరాగాంధీ అక్రమాలకు పాల్పడినందుకు ఆమె ఎన్నిక చెల్లదంటూ అలహాబాద్ హైకోర్టు తీర్పునిచ్చింది ఇందిరా గాంధీ నియంత్రత్వానికి కలిగిన తొలి అఘాతం అది. ఎన్నికలలో నిబంధనలకు మించి ధనాన్ని వెదజల్లారని ప్రభుత్వ యంత్రాంగాన్ని వినియోగించుకుని ప్రచారం నిర్వహించారని రాజనారాయణ అలహాబాద్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్లను అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ జగన్ మోహన్ లాల్ సిన్హా విచారించారు. 1975 జూన్ 12వ తేదీన ఇందిరా గాంధీ ఇంటికి చెల్లదంటూ కోర్టు సంచలనం తీర్పు ప్రకటించారు. ఇందిరాగాంధీ రెండు రకాలుగా అక్రమాలకు పాల్పడిందని జస్టిస్ సిన్హా తన 258 పేజీలో జడ్జిమెంట్లో పేర్కొన్నారు. అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై ఆమె సుప్రీంకోర్టులో అప్పిలు చేసుకుంది. ఇందిరాగాంధీ విజ్ఞప్తిని పరిశీలించిన సుప్రీంకోర్టు ఆమెకు 20 రోజులు గడువు ఇచ్చింది. అప్పుడే జరిగిన గుజరాత్ ఎన్నికలలో ప్రజలు కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా తీర్పునిచ్చారు. కాంగ్రెస్ పార్టీని ఓడించి జనతా ఫ్రంట్ కు పట్టం కట్టారు. పార్లమెంట్ సభ్యత్వం కోల్పోయిన ఇందిరాగాంధీకి నైతికంగా ప్రధానిగా కొనసాగే అర్హత లేదు. కానీ ఆమె రాజీనామా చేయడానికి అంగీకరించలేదు. జూన్ 25వ తేదీ సాయంత్రం ఢిల్లీలోని రామ్ లీలా మైదానంలో పెద్ద బహిరంగ సభ జరిగింది. మొరార్జీ దేశాయ్ అధ్యక్షతన జరిగిన సభలో జయప్రకాశ్ నారాయణ్ గడిచిన 13 రోజుల్లో జరిగిన పరిణామాలు వెల్లడించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేయడానికి కదిలి రావాలని పిలుపునిచ్చారు. దేశంలో జరుగుతున్న పరిణామాలను పరిశీలించి తాను ప్రధానిగా కొనసాగడానికి ఏదో ఒకటి చేయక తప్పదని ఇందిరాగాంధీ నిర్ణయించుకుంది. ఆ సమాలోచన ఫలితం ఎమర్జెన్సీ -అంతరంగిక అత్యవసర పరిస్థితి విధించాలన్న నిర్ణయం తీసుకున్నారు. 1975 జూన్ 25వ తేదీ అర్ధరాత్రి 11 గంటలకు రాష్ట్రపతి ప్రకృద్దీన్ అలీ ఎమర్జెన్సీ విధిస్తూ జారీ చేసే ఆదేశంపై సంతకం చేశారు. అర్ధరాత్రి నుంచి అరెస్టులు ప్రారంభమయ్యాయి. పౌర హక్కులు హరించబడ్డాయి. తెల్లవారేలోపు 400 మంది ప్రతిపక్ష నేతలను అరెస్టు చేశారు. ఆర్ఎస్ఎస్ సంస్థలో క్రియాశీల సభ్యులను తెల్లవారిలోగా అరెస్టు చేయాలని దేశమంతా ఆదేశాలు జారీ అయ్యాయి. 26వ తేదీన ఆంధ్రప్రదేశ్లో అరెస్టులు ప్రారంభమయ్యాయి. దేశమంతా ఒక భయానక వాతావరణం ఏర్పడింది. 1975 జూలై 4న ఆర్ఎస్ఎస్ ప్రైవేట్ నిషేధం విధించారు. లోక్ సంఘర్ష సమితి ఆధ్వర్యంలో కేసు వ్యాప్తంగా వ్యక్తిగత, సామూహిక సత్యాగ్రహాలు జరిగాయి. 1977 మార్చి 16, 17, 19 తేదీలలో దేశవ్యాప్తంగా అన్ని పార్లమెంటు నియోజకవర్గాలలో పోలింగ్ జరిగింది. మార్చి 21న ఫలితాలు వెలబడ్డాయి. ప్రజలు కాంగ్రెస్ ను ఓడించారు. జనతా పార్టీ అఖండ విజయం సాధించింది. 1977 మార్చి 22 న ఎమర్జెన్సీ తొలగించబడింది. ఆర్ఎస్ఎస్ పై నిషేధం తొలగిస్తున్నట్లు ప్రకటన వెలబడింది. 1977 మార్చి 24 న మొరార్జీ దేశాయ్ ను ఏకగ్రీవంగా ప్రధానిగా ఎన్నుకున్నారు. భారతదేశ చరిత్రలో చీకట్లు తొలగి వెలుగులు నింపారు అని వేమా అన్నారు. అనంతరం ఈ కార్యక్రమంలో బీజేపీ జాతీయ కిసాన్ మోర్చా కార్యవర్గ సభ్యులు నల్లా పవన్ కుమార్, పూర్వపు జిల్లా అధ్యక్షులు యాళ్ల దొరబాబు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పాలూరి సత్యానందం, తమనంపూడి రామకృష్ణారెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి గనిశెట్టి వెంకటేశ్వరరావు, ఇల్ల సత్యనారాయణ, పర్యావరణం జిల్లా కన్వీనర్ మోకా వెంకట సుబ్బారావు, జనసేన నాయకులు కల్వకలను తాతాజీ తదితరులు పాల్గొన్నారు.