బిచ్కుంద జూన్ 25 జనం న్యూస్ కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం
బిచ్కుంద మండల కేంద్రంలో యువజన కాంగ్రెస్ నాయకులు విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలను చూసి ఓర్వలేక బిజెపి నాయకులు ధర్నా రాస్తారోకో చేయడం సరికాదని కాంగ్రెస్ యువజన నాయకుడు భాస్కర్ రెడ్డి ధ్వజమెత్తారు. బిచ్కుందలో సెంట్రల్ లైటింగ్ పనులు నత్త నడకగా నడుస్తున్నాయని మరియు ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు పై ఆరోపణలు చేసే ముందు
బిజెపి ప్రభుత్వం కేంద్రంలో 11 సంవత్సరాలు అధికారంలో కొనసాగుతున్న గాని జుక్కల్ నియోజకవర్గంలో లోని బిచ్కుంద మండలానికి కేంద్ర ప్రభుత్వం నుండి ఎన్ని అభివృద్ధి నిధులు తీసుకొచ్చారని ఆయన ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వం పై ఆరోపణలు చేసే ముందు బిజెపి కేంద్రంలో ఉండి బిచ్కుందకు ఏమి చేశారని ఈ సందర్భంగా ప్రశ్నించారు. ఇలాంటి చౌకబారు రాజకీయ ఆరోపణలు మానుకోవాలని కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి పనులను సహకరించాలని ఈ సందర్భంగా తెలిపారు.