జనం న్యూస్ జూన్ 26 ముమ్మిడివరం ప్రతినిధి
ఎమర్జెన్సీ డే సందర్భంగా ఎమర్జెన్సీలో జైలుకు వెళ్లి 21 నెలలో అనేక ఇబ్బందులను ఎదుర్కొన్న అమలాపురం కి చెందిన డాక్టర్ అయ్యగారి వెంకటేశ్వరరావు ని బుధవారం ఎమర్జెన్సీ చీకటి రోజున గుర్తు చేస్తూ వారికి బీజేపీ జిల్లా అధ్యక్షులు అడబాల సత్యనారాయణ చిరు సత్కారం నిర్వహించారు. దుస్సాలువా తో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఎమర్జెన్సీ రోజులలో జరిగిన కొన్ని సంఘటనల గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా మైనార్టీ మోర్చా అధ్యక్షులు ఎస్.సాద్విక్, మండల ఉపాధ్యక్షుడు కుంచే పెరుమర్రు, యువమోర్చా నాయకులు ఏడిద వంశీ తదితరులు పాల్గొన్నారు.