జనం న్యూస్ జూన్ 25:నిజామాబాద్ జిల్లా ఏర్గట్ల
మండలంలోని గుమ్మిర్యాల గ్రామంలో పట్టపగలు చైన్ స్నాచింగ్ కలకలం రేపింది. వివరాల్లోకి వెళితే ఆ గ్రామానికి చెందిన నేరెళ్ల సాయవ్వ ( 60) వృద్ధురాలు మధ్యాహ్నం 2:30ప్రాంతంలో తన ఇంటి ఆరు బయట సేద తీరుతుండగా బైక్ పై వచ్చిన ఇద్దరు దుండగులు ఒకరు బైక్ పై ముందుకెళ్లగా వెనకాల కూర్చున్న వ్యక్తి కొద్ది దూరం నుంచి నడుచుకుంటూ వచ్చి నేరెళ్ల సాయవ్వ మెడలో నుంచి రెండున్నర తులాల బంగారు గొలుసు అపహరించుకుని బైక్ పై పరారయ్యారు. చుట్టుపక్కల ఎవరూ లేకపోవడంతో వృద్దురాలు అరుస్తుండగా యువకుడు కోమటి కొండాపూర్ వైపు పోతున్న దుండగులను కొద్ది దూరం వెంబడించిన ఫలితం లేకపోయింది. పోలీసులకు సమాచారం తెలపడంతో ఏర్గట్ల ఏఎస్ఐ లక్ష్మణ్ నాయక్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.