జనం న్యూస్ జూన్ 26 చిలిపి చెడు మండల ప్రతినిధి
మెదక్ జిల్లా చిలిపి చెడు మండలంలో గురువారం వ్యవసాయ అధికారులు మండలంలోని గంగారం గ్రామం లో మండల వ్యవసాయ అధికారి రాజశేఖర్ గారు మరియు వ్యవసాయ విస్తరణ అదికారి కృష్ణవేణి వరి పొలాలు ను సందర్శించడం జరిగింది ఈ క్రమం లో శ్రీనివాస్ రెడ్డి అనే రైతు పొలంలో వరి తుకం లో సూక్ష్మ పోషకాలు లోపాలు గమనించి రైతు కి 13:0:45@ 10 గ్రాములు+ చిలేటెడ్ జింక్@1గ్రాము లీటరు నీటిలో కలిపి పిచికారి చేయమని సూచనలు ఇవ్వడం జరిగింది. అలాగే వరి లోకాండం తొలుచు పురుగు మరియు ఉల్లి కోడును నివారించడానికి నారు పీకే వారం రోజుల ముందు ఎకరాకి సరిపోయే నారుమడికి 800 గ్రాముల కార్బోప్యూరాన్ 3జి గుళీకలు లేదా ఫిప్రోనిల్ 0.3 జి @ 600 గ్రాములు ఇసుక లో కలిపి చలుకొని పలుచగా నీరు ఉంచాలి. అలాగే నారుమడిలో అగ్గి తెగులు లక్షణాలు గమనించిన వెంటనే ట్రైసైక్లోజోల్ 0.6 గ్రాములు లేదా ఐసోప్రోథియాలోన్ 1.5 మిల్లీలీటర్ లేదా కాసుగామైసిన్ 2.5 మిల్లీలీటర్ / లీటర్ నీటికి చొప్పున కలుపుకొని పిచికారి చేసుకోవాలి అని తెలియజేశారు