జనం న్యూస్ జనవరి 24 ఆసిఫాబాద్ జిల్లా బ్యూరో:- కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా ఎస్పీ. డీవీ.శ్రీనివాస రావు , ఐపీఎస్ ఆదేశాల మేరకు ఆసిఫాబాద్, ఆసిఫాబాద్ మండలలో వివిధ గ్రామాల్లో పేకాట ఆడుతున్నారు అన్న సమాచారం మేరకు శుక్రవారం టాస్క్ఫోర్స్ పోలీసులు సోదాలు నిర్వహించారు. ఈ సోదాల్లో ఆసిఫాబాద్ మండలం లోని రహపల్లి గ్రామ శివారు ప్రాంతాల్లో పేకాట ఆడుతున్న
01). లోకండి. అత్మారం 02). చప్రే. ప్రసాద్3). జనగామ.మహేష్
వారిని పట్టుకోని, విచారించగా ఇక్కడ ఏడుగురాము ఆడుతున్నము అని పోలిస్ వారిని చూసి ఇక్కడి నుండి నలుగురు పారిపోయిన వారి వివరాలు
4). శ్రీను ). 5లోనరీ. సతీష్,6). బోయిరే. రాజేందర్7గాజుల.జలపతి
ఆటలో పాల్గొన్న వారి పై కేసు నమోదు చేసి వారి వద్ద నుండి 3800/- రూపాయల నగదు అలాగే నాలుగు మొబైల్ ఫోన్లు, ఒక మోటర్ బైక్ ని స్వాధీనం చేసుకొని ఆసిఫాబాద్ పోలిస్ స్టేషన్ లో అప్పగించినట్లు టాస్క్ ఫోర్స్ సీఐ రాణా ప్రతాప్ తెలిపారు. అనంతరం టాస్క్ఫోర్స్ వారు మాట్లాడుతూ…
ముఖ్యంగా యువత ఇలాంటి ఆన్ లైన్ జూదం, క్రికెట్ బెట్టింగ్ లు ఆడుతూ అత్యాశకు పోయి జీవితాలు పాడుచేసుకోవద్దు, ఆర్థికంగా నష్ట పోవడంతో పాటు, కేసులు నమోదయ్యితే ఉద్యోగ అవకాశాలు, ఇతర అవకాశాలు కోల్పోయే ప్రమాదం ఉందని కాబట్టి ఇలాంటి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడకూడదని తెలియజేశారు.పేకాట, ఆన్ లైన్ మట్కా, జూదం, క్రికెట్ బెట్టింగ్ లకు పాల్పడే వారి సమాచారం తెలియజేయాలని, సమాచారం ఇచ్చిన వారి పేర్లు గోప్యంగా ఉంచుతాము అని టాస్క్ ఫోర్స్
సీఐ రాణా ప్రతాప్ తెలియచేశారు. ఈ టాస్క్ లో పాల్గొన్న సీఐ . రాణా ప్రతాప్, సిబ్బంది మధూ, రమేష్ సంజీవ్, దేవేందర్ స్పెషల్ పార్టీ సిబ్బంది పాల్గొన్నారు.