జనం న్యూస్ 27జూన్ పెగడపల్లి ప్రతినిధి.
జగిత్యాల జిల్లా పెగడపల్లి మండలం అయితుపల్లి గ్రామంలో పల్లె మోహన్ రెడ్డి, గంగుల కొమురెల్లి మరియు మర్రిపెల్లి సత్యం ఆధ్వర్యంలో వికాసీత్ భారత్, భారత ప్రధాని నరేంద్ర మోడీ 11 సుపరిపాలనలో భాగంగా కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజలకు వివరిస్తూ కరపత్రాలు ఇవ్వడం జరిగింది.ఈ కార్యక్రమం లో భాగంగా సీతారామచంద్రస్వామి ఆలయంలో మొక్కలు నాటారు. అదేవిధంగా హనుమాన్ గుడి ఆవరణలో మొక్కలు నాటడం జరిగింది.ఈ కార్యక్రమం లో మండల కాంగ్రెస్ అధ్యక్షులు పల్లె మోహన్ రెడ్డి, జిల్లా అధికార ప్రతినిధి మరియు సత్యం మరియు పగడపల్లి మండల కన్వీనర్ గంగుల కొమురెల్లి, కోట మల్లేశం, కూనా కుమార్, సాగర్, జక్కుల హరీష్,బల్కం స్వామి,నితిన్, గట్టయ్య, పలుమారు అభి మరియు గ్రామా ప్రజలు పాల్గొన్నారు.