అంగడి కిష్టాపూర్ పాఠశాలకు, దాతల సహకారం అభిందనీయం
స్పందన చారిటబుల్ ట్రస్ట్, మరియు మ్యాకాల కనకయ్య ముదిరాజ్ విద్యార్థులకు చేయిత
జనం న్యూస్, జూన్ 27 ( తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ ములుగు విజయ్ కుమార్ )
అంగడికిష్టాపూర్ పాఠశాల ఉపాధ్యాయుల నిబద్ధత తల్లిదండ్రుల భాగస్వామ్యం పాఠశాలకు దాతల సహకారంతో రాష్ట్రంలోనే ఉత్తమ పాఠశాలగా పనిచేయడం అభినందనీయమని మండల విద్యాధికారి వెంకటరాములు,అన్నారు గురువారం మండల పరిధిలోని అంగడి కిష్టాపూర్ ప్రాథమికోన్నత పాఠశాలలో చదివే 230 మంది విద్యార్థులకు స్పందన చారిటబుల్ ట్రస్ట్ సౌజన్యంతో మరియు మేకల కనకయ్య ముదిరాజ్, భాగస్వామ్యంతో విద్యార్థులకు ప్రింట్ హ్యాండ్ రైటింగ్ నోటు పుస్తకాలను మరియు ప్రీ ప్రైమరీ పిల్లలకు మాధ్యమ సెమిస్టర్ పుస్తకాలను అందించారు. ఈ సందర్భంగా మేకల కనకయ్య ముదిరాజ్, మాట్లాడుతూ బడికి గుడికి ఎప్పుడు కూడా నా శక్తిమేర సహకరిస్తానని బడిలో చదివే పిల్లలే భవిష్యత్తులో ఉద్యోగులుగా మారుతారని అంగడికిష్టాపూర్ పాఠశాల అందరికీ ఆదర్శమని అందులో భాగస్వామ్యం కావడం చాలా సంతోషమని ప్రతి సంవత్సరం నా వంతు భాగస్వామ్యాన్ని అందిస్తానని అన్నారు. కార్యక్రమంలో మాజీ సర్పంచ్ రాములు గౌడ్,ఉపాధ్యాయులు హారిక, సంతోషి మాత, చిన్ని కృష్ణ, పాఠశాల ఎస్ఎంసి చైర్మన్ బాల్ రెడ్డి, వైస్ చైర్మన్ కనకయ్య, అమ్మ ఆదర్శ పాఠశాల చైర్పర్సన్ నాగమణి, సిఆర్పి అంజలి, విద్యార్థిని విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.