జనం న్యూస్, జూన్26, అచ్యుతాపురం:అచ్యుతాపురం మండలం లోని పూడిమడక గ్రామంలో వెలసియున్న శ్రీ లక్ష్మీ సమేత జగన్నాథ స్వామి రథ యాత్ర సందర్భంగా చిప్పాడ 11కేవీ ఫీడర్ పరిధిలో గల 27వ తేదీ అనగా శుక్రవారం సాయంత్రం ఐదు గంటల నుండి రాత్రి 8:30 గంటలు వరకు పెద్దూరు,కొండపాలెం, కడపాలెం,జాలరి పాలెం,ఎస్సీ కాలనీ,పల్లిపేట ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం
కలుగుతుందని ఏఈ ఎం శ్రీనివాసరావు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. విద్యుత్ వినియోగదారులు అందరూ సహకరించాలని కోరారు.