జనం న్యూస్ జూన్ 26 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ
ముమ్మిడివరం సీఐ ఎం మోహన్ కుమార్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ డ్రగ్స్ వ్యతిరేక దినోత్సవం నిర్వహించారు. స్థానిక పోలీస్ స్టేషన్ వద్ద గురువారం డ్రగ్స్ వద్దు బ్రో కార్యక్రమంలో కూటమి నాయకులు తో కలిసి మాజీ ఎమ్మెల్యే చెల్లి వివేకానంద పాల్గొని మాట్లాడారు.. యువత డ్రగ్స్ కు బానిసలు కాకుండా వారి విలువైన జీవితాలను తమ కుటుంబాలతో పాటు సమాజహితానికి వినియోగించాలన్నారు.ఈ కార్యక్రమంలో టిడిపి రాష్ట్ర కార్యదర్శి గుత్తుల సాయి, గొల్ల కోటి దొరబాబు, అర్థాన్ని శ్రీనివాసరావు, దొమ్మేటి రమణ కుమార్, ముమ్మిడివరం ఎస్సై డి .జ్వాలా సాగర్ , ఐ పోలవరం ఎస్సై ఎం వివి రవీంద్రబాబు, కాట్రేనికోన ఎస్సై అవినాష్ , బి శ్రీ గణిత, ఎం గంగభవాని, కె రామ్ కుమార్ , ఎస్ శేషుబాబు, ములపర్తి బాలకృష్ణ,గొల్లపల్లి గోపి, ఏళ్ల ఉదయ్ , నడింపల్లి శ్రీనివాసరాజు,జనసేన, బిజెపి నాయకులు, కార్యకర్తలు,యువత, పోలీసులు, ఎక్సైజ్ శాఖ అధికారులు పాల్గొన్నారు.