జనం న్యూస్ జూన్ 27(మునగాల మండల ప్రతినిధి కందిబండ హరీష్)-
మునగాల మండల కేంద్రంలోని ఫ్లై ఓవర్ అండర్ పాస్ బ్రిడ్జి వద్ద మునగాల పోలీస్ శాఖ ఆధ్వర్యంలో విద్యార్థులతో మాదకద్రవ్యాల నిర్మూలన ర్యాలీ మరియు మానవహారం కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా మునగాల సర్కిల్ సీఐ రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ.. మన సమాజం నుండి గంజాయి డ్రగ్స్ లాంటి మత్తు పదార్థాలను వెలువేయాలని డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగ్యస్వామ్యం కావాలని అన్నారు.ఈ డ్రగ్స్ అనేవి మన పిల్లల జీవితాన్ని చిన్నాభిన్నం చేస్తాయని,పిల్లలల్లో తద్వారా నేర ప్రవృత్తి పెరుగుతుందని తెలిపారు.