జనం న్యూస్ జూన్ 27 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ
మండల కేంద్రమైన కాట్రేనికోనలో ఆవులు ఆబోతుల సంచారం మూలంగా వ్యాపారస్తులు వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. ఈ విషయమై స్పందించిన పంచాయతీ సిబ్బంది శుక్రవారం నుండి ఆవులను వేటాడుతున్నారు. పంచాయతీ కార్యదర్శి జే వి వి సత్యనారాయణ పర్యవేక్షణలో సిబ్బంది వీటిని పట్టుకుని పంచాయతీ వద్ద కట్టేస్తున్నారు. తర్వాత వీటన్నిటిని లారీలో కరవాక తరలిస్తామని ఆయన తెలిపారు. గ్రామస్తులు పంచాయతీ అధికారులు తీసుకుంటున్న చర్యలకు సంతోషిస్తున్నారు. అయితే వీటిని పూర్తిగా అమలు చేస్తారా లేక రాజకీయ ఒత్తిళ్లకు లొంగిపోతారా? అన్న అనుమానాలను కూడా జనం వ్యక్తం చేస్తున్నారు.