కార్మికులకు దోమలు తెరలు పంపిణీ
జనం న్యూస్,జూన్27,అచ్యుతాపురం:
అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం మండలంలో నిర్మాణంలో ఉన్న ఈఎస్ఐ హాస్పిటల్ పనులను ఎలమంచిలి ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ శుక్రవారం పరిశీలించి పనుల ప్రగతిని అడిగి తెలుసుకున్నారు. పనులను వేగవంతం చేసి సకాలంలో పూర్తి చేయాలని సూచించారు. మరియు హాస్పిటల్ నిర్మాణ పనులు చేస్తున్న కార్మికులకు దోమలు తెరలు ఎమ్మెల్యే చేతుల మీదుగా పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో కాంట్రాక్టర్లు,ఇంజనీర్లు.కూటమి నాయకులు పాల్గొన్నారు..