రైతులకు నాణ్యవంతమైన విత్తనాలు విక్ర యించాలని ఫర్టిలైజర్ దుకాణదారులకు వ్యవసాయ శాఖ జిల్లా అధికారి శ్రీధర్ రెడ్డి
జనం న్యూస్ జూన్ 28(మునగాల మండల ప్రతినిధి కందిబండ హరీష్)-
మునగాల మండల కేంద్రంలోని పలు విత్తనాల, ఎరువుల,పురుగు మందుల దుకాణాలను సూర్యాపేట జిల్లా వ్యవసాయ అధికారి శ్రీధర్ రెడ్డి పరిశీలించారు.ఈ సందర్భంగా మండలంలో సహకార సంఘాలలో మరియు ప్రైవేటు దుకాణాల వద్ద సమృద్ధిగా విత్తనాలు, ఎరువులు ఉన్నాయని లైసెన్స్ కలిగిన దుకాణాల నుంచి మాత్రమే విత్తనాలు, ఎరువులు, పురుగుమందులు కొనుగోలు చేయాలని పంట పూర్తయ్యే వరకు బిల్లులను, బస్తాలను దాచి పెట్టుకోవాలని పంటకు సంబంధించి ఎలాంటి ఇబ్బంది ఉన్నా సంబంధిత వ్యవసాయ శాఖ అధికారులను సంప్రదించాలని రైతులకు తెలియజేశారు .డీలర్ లను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ.. రైతులకు నాణ్యమైన విత్తనాలు, ఎరువులు,పురుగుమందులు మాత్రమే అమ్మాలనీ, స్టాక్ రిజిస్టర్ లను,బిల్ బుక్ లను ఎప్పటికప్పుడు అప్డేట్ చేయాలని సూచించారు. రైతులకు నాణ్యమైన విత్తనాలను విక్రయించాలని డీలర్లకు సూచించారు.రైతులు ఎరువులు కొనుగోలు చేసిన సమయంలో విధిగా బిల్లులు ఇవ్వాలని,దుకాణాల ఎదుట ధరల పట్టిక ఏర్పాటు చేయాలని దుకాణాల నిర్వాహకులకు సూచించారు.ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి బి.రాజు డీలర్లు రాజేష్, ప్రసాద్, రామ్ రెడ్డి, సొసైటీ సిబ్బంది శ్రీనివాస్, బసవయ్య పాల్గొన్నారు.