జనం న్యూస్ 28జూన్ పెగడపల్లి ప్రతినిధి.
జగిత్యాల జిల్లా పెగడపల్లి మండలం అయితుపల్లి గ్రామంలో భారతీయ జనతా పార్టీ పెగడపల్లి మండల అధ్యక్షుడు పల్లె మోహన్ రెడ్డి అధ్యర్యం మరియు గ్రామాశాఖ అధ్యర్యంలో అయితుపల్లి గ్రామంలో క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించడం జరుగుతుంది.ఈ ఆటలో పాల్గొంటున్న టీం సభ్యులకు శుభాకాంక్షలు తెలుపుతూ ఆటను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు పల్లె మోహన్ రెడ్డి,జిల్లాఅధికార ప్రతినిధి మర్రిపెల్లి సత్యం, కోట మల్లేశం, జక్కుల హరీష్, కూనా సాగర్,మరియు యువ క్రికెట్ నాయకులు పాల్గొన్నారు.