కాంగ్రెస్ పార్టీ నాయకుల ఆధ్వర్యంలో.
జనం న్యూస్ 28 జూన్ 2025 (ఎల్కతుర్తి మండల్ బండి కుమార్ స్వామి రిపోర్టర్)
ఎల్కతుర్తి మండల కేంద్రంలోని జిలుగుల గ్రామంలో కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు తౌటం నరేందర్ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని శనివారం నిర్వహించారు. లబ్ధిదారులైనటువంటి కెక్కెర్ల శ్రీనివాస్ కు 60 వేల రూపాయల చెక్కును కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలతో కలిసి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు తౌటం నరేందర్ మాట్లాడుతూ. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విద్య వైద్య రంగానికి పెద్దపీట వేస్తుందన్నారు. ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి నాయకత్వంలో సంక్షేమ పథకాల అభివృద్ధి జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచులు గూటం జోగిరెడ్డి, రావుల రమేష్, మాజీ ఉప సర్పంచ్, తంగేళ్ల ప్రవీణ్ కుమార్, రావుల గుండయ్య, బిల్లా ప్రభాకర్, ముచ్చ తిరుపతి రెడ్డి, గూటం సమ్మిరెడ్డి, పల్లె రాజయ్య గౌడ్, వేముల మనోహర్, ఆరెపల్లి సారయ్య, ఆరెపల్లి ప్రభాకర్, ఆరెపల్లి రాజయ్య, ఎండి మీరా సాబ్, పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.