జనం న్యూస్ జూన్ 28
సంగారెడ్డి జిల్లా పటాన్ చేరు మండలం ఇంద్రేశం గ్రామం రింగ్ రోడ్ సమీపంలో ఉండడంతో భూముల ధరలు అమాతం పెరిగిపోయి అక్రమ నిర్మాణాలు చేపడుతున్నారు. గ్రామపంచాయతీ నిబంధన ప్రకారం జి ప్లస్ టు పర్మిషన్లు ఉంటాయి. కానీ ఇంద్రేశం గ్రామంలో బిల్డర్లు జి ప్లస్ టు అనుమతులు పొంది జి ప్లస్ ఫోర్ కట్టడాలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో జిల్లా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు అక్రమ నిర్మాణాలు చేపడుతున్న వారిపై ఇంద్రేశం గ్రామ పంచాయతీ కార్యదర్శి సుభాష్ శనివారం ఉదయం కూల్చివేతలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అక్రమ నిర్మాణం చేపట్టే వారిపై కఠినంగా చర్యలు తీసుకుంటామని ఆయన అన్నారు.ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు.