వైసీపీ స్టేట్ ఆర్టీఐ విభాగం జనరల్ సెక్రటరీ మాజీ ఎంపీపీ కడప వంశీధర్ రెడ్డి.
బేస్తవారిపేట ప్రతినిధి, జూన్ 28 (జనం న్యూస్):
ఏపీ: టీడీపీ నేతలు ఇళ్లకి వచ్చినప్పుడు వాళ్లిచ్చిన హామీల అమలుపై ప్రజలు నిలదీయాలని వైసీపీ నేత కడప వంశీధర్ రెడ్డి పిలుపునిచ్చారు. 'జగన్ ఐదేళ్లలో రాష్ట్రాన్ని 15 ఏళ్లు ముందుకు తీసుకెళ్తే.. చంద్రబాబు ఏడాదిలో 15 ఏళ్లు వెనక్కి తీసుకెళ్లారు. చంద్రబాబు ఇచ్చిన హామీలను అంతా మర్చిపోయారని అనుకుంటున్నారు. అలా మర్చిపోకూడదనే హామీలు గుర్తుచేసే ఒక క్యాంపెయిన్ ను జగన్ మోహన్ రెడ్డి ప్రారంభించారు' అని వ్యాఖ్యానించారు.