నియోజకవర్గం లో చదువుకున్న యూవతకు చేయూతనివ్వడమే లక్ష్యం
జనం న్యూస్, జూన్ 28, జగిత్యాల జిల్లా,
కోరుట్ల: పట్టణంలోని కటకం సంగయ్య ఫంక్షన్ హాల్ లో కోరుట్ల నియోజకవర్గం బిఆర్ఎస్ ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ…. నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించేందుకు సుమారు 67 కంపెనీలతో రెండువేలకు పైగా ఉద్యోగాలు యువతకు అందించేందుకు మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నామని అన్నారు. ఇందులో ఉద్యోగం పొందని వారు నిరాశ చెందకూడదని రానున్న కాలంలో స్కిల్ డెవలప్మెంట్ చేసి ఉద్యోగం పొందేందుకు ప్రత్యేకంగా కోచింగ్ సెంటర్లు ఏర్పాటు చేసి ఉద్యోగం పొందేలా తీర్చి దిద్దుతామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. నియోజకవర్గం లో చదువుకున్న ప్రతి నిరుద్యోగ యువతకు ఉపాధి అందించడమే లక్ష్యం అని అన్నారు, ప్రత్యేకంగా మహిళలపై శ్రద్ధ చూపి వారిని అన్ని రంగాలలో రాణించేలా అవకాశాలు కల్పిస్తామని చెప్పారు,