జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట జూన్ 28 రిపోర్టర్ సలికినీడి నాగు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం పాఠశాల విద్యాశాఖ ఆదేశాల మేరకు జూలై 15 వరకు ఎన్రోల్మెంట్ డ్రైవ్ లో భాగంగా చిలకలూరిపేట పట్టణంలోని 34 వార్డు పోలిరెడ్డి పాలెం ఆవాస ప్రాంతమైన మదర్ తెరిసా కాలనీ నందు విద్యార్థులతో ఇంటింటి ప్రచారం నిర్వహించడం జరిగింది ప్రభుత్వ పాఠశాలలు అందించే సౌకర్యాలు విద్యార్థిని విద్యార్థులు తల్లిదండ్రులకు వివరించడం జరిగింది ప్రతి విద్యార్థికి తల్లికి వందనం కింద 15వేల రూపాయలు ఆర్థిక సహాయం ఉచితంగా పాఠ్యపుస్తకాలు, యూనిఫామ్ షూస్ బెల్ట్ సాక్స్ బ్యాగ్ ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది. నాణ్యమైన ఇంగ్లీష్ మీడియం లో విద్యాబోధన చేయడం జరుగుతుంది. పాఠశాలలో విద్యార్థుల సంఖ్యను బట్టి స్మార్ట్ టీవీల ద్వారా డిజిటల్ పాఠ్యాంశాలను బోధించడం జరుగుతుంది.సుశిక్షితులయిన, అత్యున్నత శిక్షణ పొందిన ఉపాధ్యాయులచే విద్యాబోధన జరపడం జరుగుతుంది. విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకం ద్వారా ఐదు రోజులు కోడిగుడ్డు మూడు రోజులు చిక్కి మూడు రోజులు రాగి జావా ప్రతిరోజు ప్రత్యేక మెనుతో అత్యంత పోషక విలువలు కలిగిన భోజనం అందించడం జరుగుతుంది కావున విద్యార్థుల విద్యార్థులను ఆ పాఠశాలలో చేర్పించాలని కోరడం జరిగింది ప్రభుత్వ పాఠశాలను పరిరక్షించుకోవడంలో భాగంగా తల్లిదండ్రులు సామాజిక వేత్తలు సహకరించాలని కోరడం జరిగింది మున్సిపల్ ప్రాథమిక పాఠశాల పోలిరెడ్డి పాలెం పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు జై హైమావతి, ఉపాధ్యాయినీ ఉపాధ్యాయులు పి.శైలజ,పోటు శ్రీనివాసరావు, కే అరుణ జి ఆదిలక్ష్మి,సిహెచ్ నవ్య శ్రీ పేరెంట్స్ కమిటీ సభ్యులు పాల్గొన్నారు