అర్హులైన లబ్ధిదారులందరికీ ఇండ్లను అందించడమే రేవంత్ రెడ్డి సర్కార్ లక్ష్యం - జువ్వాడి కృష్ణారావు
జనం న్యూస్, జూన్ 29, జగిత్యాల జిల్లా, ఇబ్రహీంపట్నం మండలం: మండలంలో గల వేములకుర్తి గ్రామంలో ఈ రోజు జువ్వడి కృష్ణారావు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాపకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి భూమి పూజ చేయడం జరిగింది, ఈ కార్యక్రమంలో భాగంగా వేములకుర్తి గ్రామంలోని నాంపల్లి వెంకటాద్రి, అందుగుల నాగేష్ మరియు గ్రామంలోని తదితర ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు ఇల్లు నిర్మాణం కొరకు భూమి పూజ నిర్వహించారు, జువ్వాడి కృష్ణారావు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రతి పేదింటి వారి కళ నిజం చేయడానికి లబ్ధిదారులందరికీ విడుదలవారీగా అందరికీ ఇంటి నిర్మాణం కోసం సహాయం అందిస్తామని తెలిపారు, రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి ఇల్లు ఉండాలని రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య ఉద్దేశమని తెలిపారు, ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ మండల అధ్యక్షుడు గూడ శ్రీకాంత్, నేరెళ్ల దేవేందర్, నాయిని సురేష్, ఏళ్లాల వెంకటరెడ్డి, నాంపల్లి వెంకటాద్రి, గుమ్మల రమేష్, అంకతి రాజన్న, బుర్రి ముత్తన్న, తరి రామానుజన్, ఇందిరమ్మ కమిటీ సభ్యులు, గ్రామ ప్రజలు తదితర కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు